పేదలకు వరం గురుకులం

బడుగు విద్యార్థులకు సర్కారు విద్యాగొడుగు పేదలకు వరం గురుకులం

 

 

 

 

 

 

 

 

బడుగు విద్యార్థులకు సర్కారు విద్యాగొడుగు
సీఎం కేసీఆర్‌ హామీ మేరకు ‘కేజీ టు పీజీ’ మిషన్‌ అమలుఉమ్మడి జిల్లాలో వందకు పైగా విద్యాలయాల ఏర్పాటుకార్పొరేట్‌ స్థాయి బోధన, వసతులుచదువుతోపాటు క్రీడలు, యోగ, ధ్యానం.. అన్నింట్లోనూ తర్ఫీదువేలాది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థలుపేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. కార్పొరేట్‌ స్థాయి హంగులతో ఏర్పాటైన ఈ విద్యాసంస్థలు.. బడుగు జీవులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యాబోధన, అద్భుతమైన వసతుల కల్పన, క్రీడలతో పాటు వివిధ అంశాల్లో ఉత్తమ శిక్షణకు ఇవి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. చదువుతోనే బడుగుల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్‌.. విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టిన ప్రభుత్వం.. ఎనిమిదేండ్లలో ఉమ్మడి జిల్లాలో వందకు పైగా గురుకులాలను ప్రారంభించింది. పాఠశాల విద్యతో పాటు ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు సైతం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బడుగు వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేసింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షకు పైగా వెచ్చిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నది.