పేదలకు వరం సీఎం సహాయ నిధి – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ (జనం సాక్షి),
చౌటుప్పల్ మండలం పరిధిలో వ్యవసాయ మార్కెటులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 65 చెక్కులను, మొత్తం చెక్కల విలువ 26లక్షల రుపాయల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఆమలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, తెరాస పార్టి మండల అధ్యక్షుడు గిరికిటి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.