పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ లో ఘనంగా ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు
_జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహినోద్దిన్
జహీరాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎంపీ బీవీ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ఎంపీ బీబీ పాటిల్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎంపీ తన వంతు సహకారం అందిస్తున్నారన్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి మేలు కోసం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజల సంక్షేమానికి కృత్యాలన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్ , జహీరాబాద్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ మోహియోద్దీన్ టిఆర్ఎస్ నాయకులు జి గుండప్ప, మంకల్ సుభాష్, శ్రీకాంత్ రెడ్డి, ముర్తుజా, మంజుల, గోరేమియా సికిందర్, జహంగీర్, రాములు నేత, మోతిరామ్, వెంకట్, పద్మజ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.