పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక చేయూతను అందిస్తున్న CMRF : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు

ఈరోజు (05-11-2022) శనివారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ధారూర్ మండలం మరియు మోమిన్ పేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.4,05,500/- (రూపాయలు నాలుగు లక్షల ఐదు వెల ఐదు వందలు) విలువ గల 12 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.