పేద ప్రజల గుండెల్లో మాణిక్ రావు మహారాజ్ చిరస్మరణీయులు. బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్.
నిరుపేద ప్రజల గుండెల్లో మాణిక్ రావు మాహరాజ్ చిరస్మరణీయులని బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారందివంగత నేత మాజీ మంత్రి మాణిక్ రావు 7వ వర్ధంతి సందర్భంగా బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ నాయకులతో కలిసి పట్టణంలో ని మాణిక్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతు తాండూర్ పాంత్రంలో బహుజన నాయకుడిగా రాష్ట్ర మంత్రి గా అనేక సేవలు అందించారని తెలిపారు. పేద ప్రజల కోసం అనేక శివ కార్యక్రమాలు చేపట్టిన మహోన్నత వ్యక్తి మాణిక్ రావు మహారాజు అన్నారు.తాండూర్ ప్రజలకోసం పీపుల్స్ కాలేజీ ని స్థాపించారు అని, అయన ఆశయ సాధనకు తాండూర్ ప్రజలు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్, బిమప్ప ,కావలి సంతోష్ కుమార్ తోపాటు తదితరులు ఉన్నారు.