పేలుళ్లలో గాయపడిన కరీంనగర్ వాసి
సైదాపూర్: హైదరాబాద్ బాంబు పేలుళ్లలో రాయికల్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి యూ. రాజీవ్‌కుమార్ గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నంలో శ్రీదత్తా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కంప్యూటర్ క్లాస్ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.