పైకా క్రీడలపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30 : జనవరిలో నిర్వహించనున్న జాతీయ పైకా క్రీడల కార్యక్రమాలపై జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 11 నుంచి 14 వరకు జాతీయ స్థాయిలో కబడీ, ఖోఖో క్రీడలలో పాల్గొనటానికి, వివిధ రాష్ట్రాల నుంచి 2,200 మంది క్రీడకారులు హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ యొక్క క్రీడల్లో జిల్లా అధికారులు సమీష్టిగా కృషి చేసి జాతీయ క్రీడలు విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడల అభివృద్ది అధికారి సుధాకర్‌, పిడిలు, ఆర్‌డిఎ, డ్వామా, వెంకటకృష్ణరెడ్డి, వినయ్‌కృష్ణరెడ్డి, వికలాంగుల శాఖ నారాయణరావు, ఆర్‌విఎం రవీందర్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.