పైలెట్ చాకచక్యంతో ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ముప్పు!

indigo-airlines-flightఇండిగో విమానానికి గత నెలలో పెను ప్రమాదం తప్పింది. ఏప్రిల్ 26న హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ-026)బయలుదేరిన కొద్దిసేపటికి అందులో తగినంత ఇంధనం లేదని పైలట్ గమనించాడు. దుబాయ్ వెళ్లేందుకు 13 టన్నుల ఇంధనం అవసరం కాగా, దానికన్నా ఒక టన్ను తక్కువ ఫ్యూయల్ ఉందని పైలట్ గుర్తించాడు. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ఫ్లైట్ ముంబై మీదుగా ఎగురుతున్నప్పుడు దాన్ని ముంబైలో ల్యాండ్ చేయాలనుకున్నాడు. అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులతో మాట్లాడి, ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ముంబై ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. చాకచక్యంతో వ్యవహరించిన పైలెట్ ను అధికారులు అభినందించారు. ఫ్లైట్ లో అవసరమైన దానికన్నా తక్కువ జెట్ ఫ్యూయెల్ ను నింపిన టెక్నీషియన్, అతనిపై ఉన్నతాధికారి నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారి పనితీరును పరిశీలించాక చర్య తీసుకుంటామని డీజీసీఏ అధికారులు తెలిపారు.