పైలేరియా నివారణమాత్రలు సామూహిక పంపిణీ
కరీంనగర్, జనవరి 28 (): తొమ్మిదవ విడత పైలేరియా(బోదవ్యాధి) నివారణ మాత్రలు సామూహిక పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చే సిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైలేరియా సమూల నివారణకు ప్రభుత్వం సామూహిక మాత్రలు పంపిణీ కార్యక్రమంచేపట్టిందని, రాష్ట్రంలో 16జిల్లాల్లో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నందున, అందులో కరీంనగర్ జిల్లా కూడా ఉన్నందున వ్యాధి అంతానికి చర్యల్లో భాగంగా మాత్రలు సామూహిక పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి వాలంటైర్ 300మంది జనాభాకు మాత్రలు పంపిణీ చేయాల్సిందని ఆదేశించామని, 25,26,27 తేదీల్లో వాలంటీర్లకు కార్యక్రమంపై శిక్షణ తరగతులు నిర్వహించామని, ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో పైలేరియా సమూల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ అలీమ్ తదితరులు ఉన్నారు.