పొమ్మన లేక మాకు పొగ పెడుతున్నారు : కొండా సురేఖ దంపతులు
– టీఆర్‌ఎస్ జాబితాలో నాపేరు లేకపోవటం బాధ కలిగించింది
– నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి
– మంత్రి పదవి ఇస్తామని హావిూ ఇచ్చారు
– అయినా ఇన్నాళ్లు మేమెక్కడా వారిని ప్రశ్నించలేదు
– కేటీఆర్ కోటరీని తయారు చేసుకుంటున్నారు
– ప్రశ్నిస్తామనే భయంతోనే మమ్మల్ని పక్కకు తప్పించేయత్నం
– టీఆర్‌ఎస్ పెద్దల సమాధానం బట్టి మా నిర్ణయం ఉంటుంది
– అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతాం
– విలేకరుల సమావేశంలో కొండా సురేఖ
హైదరాబాద్, సెప్టెంబర్8(జనంసాక్షి) : ఇటీవల టీఆర్‌ఎస్ ప్రకటించిన తొలిజాబితాలో నాపేరు లేకపోవడం తనను తీవ్రంగా బాధించిందని, అసలు నాకు టికెట్ ఇవ్వకపోవటానికి నేను చేసిన తప్పేంటో టీఆర్‌ఎస్ పెద్దలు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలు కొండా సురేఖ ప్రశ్నించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కొండా మురళితో కలిసి సురేఖ విలేకరులతో మాట్లాడారు. వరంగల్ తూర్పు నుంచి తాను భారీ మెజార్టీతో గెలిచాన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. బీసీ మహిళనైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని.. అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు. వరంగల్ తూర్పు నుంచి భారీ మెజార్టీతో గెలిచానని ఈ సందర్భంగా కొండా
సురేఖ చెప్పుకొచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కొండా సురేఖ తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం అమానించడమే అని అన్నారు. టీఆర్‌ఎస్‌లో తాము చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదన్నారు. గతంలోను తాను మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టానని ఈ సందర్భంగా కొండా సురేఖ గుర్తుచేశారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ నుంచి తాము ఎలాంటి లబ్ది పొందలేదని, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశామని పేర్కొన్నారు. తనకు సీటు ఇవ్వకపోవడం మహిళలందరినీ అవమానించడమే అని విమర్శించారు. మహిళల పాత్ర లేకుండానే తెలంగాణ వచ్చిందా అంటూ ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ గుర్తుపైనే గెలిచిన తాము చేదు అయ్యామని… కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎందుకు తీపి అయ్యారని ఆమె టీఆరెస్ అధిష్టానాన్ని నిలదీశారు. ఎర్రబెల్లికి తనకు పడదని తెలిసినప్పటికీ ఆయన్ని టీఆరెస్‌లో చేర్చుకున్నారని, ఈ విషయంలో తమను కనీసం సంప్రదించలేదని ఆవేదన చెందారు. టీఆరెస్ టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల రిపోర్ట్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
తాము రెండు సీట్లు అడిగానడం తప్పు..
ఎవరి ప్రభావంతో తన టికెట్ ఆపారో చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. తాము రెండు సీట్లు అడిగామనడం అబద్ధమని, తమను పొమ్మనలేక పొగబెట్టారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదంటూ తమకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల తనకు కేటీఆర్ ఫోన్ చేశారని, విూ కుమార్తెకు, విూకు ఇద్దరికి టికెట్‌లు కావాలని అడుగుతున్నారు అది సాధ్యం కాదని కేసీఆర్ చెప్పామన్నారని చెప్పారని అన్నారు. దీంతో కేవలం నాకు మాత్రమే నేనే టికెట్ అడిగాను ఒక్క టికెట్ ఇస్తే సరిపోదుందని చెప్పానని తెలిపారు. ఆ తరువాత ఇటీవల కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో కలిసినప్పుడు కేటీఆర్‌కు చెప్పానని పరకాల టికెట్ ఒక్కటే కోరుతున్నామని అన్నామని, దీంతో కేటీఆర్ ఓకే అని చెప్పారని అన్నారు. కానీ కేటీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారని సురేఖ ఆరోపించారు. కేటీఆర్ తన కోటరీని నిర్మించుకుంటున్నాడని అన్నారు. ఇందులో భాగంగానే ఎంపీగా ఉన్న బాల్కన్ సుమన్‌ను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి తమ్ముడిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపాల్సిన అవసరం ఏమొచ్చిందని సురేఖ ప్రశ్నించారు. ఈ తరుణంలో తనకు టికెట్ ఇస్తే తాను గెలిచి ఏమైనా వారిని ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావించి తనను తప్పించేలా ఇలాంటి చర్యకు పాల్పడ్డారని సురేఖ అభిప్రాయ పడ్డారు. తనకు కు టికెట్ ఇవ్వకపోవడానిక కేటీఆరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజల్లో నుంచి వచ్చిన వారమని తమ ఇంటి నుండి ముగ్గరం ఇండిపెండెంట్‌గా నిలబడి గెలిచే సత్తా మాకుందన్నారు. టీఆర్‌ఎస్ పెద్దలు ఇచ్చిన సమాధానం ప్రకారం మా నిర్ణయం ఉంటుందని సురేఖ దంపతులు స్పష్టం చేశారు. తొలి విడతలో ప్రకటించిన వారిందరికీ బీఫాంలు ఇస్తారనే నమ్మకమూ లేదని, వారిలో చాలా మందిని మార్చే అవకాశాలు ఉన్నాయని సురేఖ అన్నారు.