పొలంలోనే మరణించిన రైతు

విజయనగరం,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): వరి చేనులోని నీటిని దిగువకు వదిలేందుకు పారపట్టుకొని పొలంలో బట్టి వేస్తున్న వృద్ధ రైతు అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఊహించని ఉపద్రవంలా వచ్చిన పెథాయ్‌ తుపాను ధాటికి తెలుగు రాష్ట్రాల్లో పంటలు నీటిపాలైతే.. ఎముకలు కొరికే చలిగాలుల దెబ్బకు మూగజీవాలు ప్రాణాలు వదిలాయి. ఈ నేపథ్యంలో.. కళ్ల ముందే కష్టం నీటి పాలవుతుంటే చూడలేకపోయిన ఓ వృద్ధ రైతు వరి చేనును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణం విడిచారు. మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం గొట్టిపల్లి చిన్నవాడు (70) అనే వృద్ధ రైతు తన పొలంలో వరిచేను నీటిలో తడిసి ముద్దవుతోందని బాధతో.. పొలంలో నీటిని
దిగువకు వదిలేందుకు పార పట్టుకొని పొలంలో బట్టి వేస్తూనే.. అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. వృద్ధునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.