పోలవరంపై విమర్శలు ఆపాలి : ఉమ

విజయవాడ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పోలవరంపై వైకాపా నేతల విమర్శలు ఆగాలని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకోవడం వల్ల నస్టపోయేది ఎపి ప్రజలేనని అన్నారు. వైకాపా అధినేత జగన్‌ కావాలనే పట్టిసీమ నుంచి నీళ్లు రాలేదంటున్నారని.. పోలవరం, అమరావతిపై కేసులు వేసి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం తామే

మొదలుపెట్టామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు.. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కూడా అప్రూవ్‌ చేయలేకపోయారని విమర్శించారు. 5వేల కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్‌ నేతలు మట్టిపనులు చేసి కోట్లు దండుకున్నారన్నారు. సీడబ్ల్యూసీ నియమాలకు అనుగుణంగా కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తిచేస్తామని వెల్లడించారు. విభజన సంద్భంగా ఎపికి ప్రత్యేక¬దా కోసం చేసిన డిమాండ్‌ చేసినా చట్టంలో పెట్టనందువల్లనే సాధ్యం కావలేదని స్పష్టం చేశారు. ఎపీకి ప్రత్యేక ప్రత్యేక ¬దా ఇవ్వాలని విభజన సమయంలో అడిగామని కానీ కాంగ్రెస్‌ చట్టబద్దత చేసివుంటే ఇలా జరిగేది కాదన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక ¬దా అంశం చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏమాత్రం పట్టించుకోలేదు.

తాజావార్తలు