పోలవరం ఏజెన్సీలో రహదారులు బాగు చేయండి

ఏలూరు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన పోలవరం నుంచి 19 గ్రామాలకు వెళ్లే రహదారులను తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఏజేన్సీ గ్రామాలప్రజలు కోరుతున్నారు. గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ నేటి వరకు పోలవరం నుంచి ఆయా గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించక పోవటం పట్ల కొండ్రుకోట ఎంపీటీసీ సభ్యుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇటీవలి వర్షౄలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అన్నారు. వెంటనే రహదారుల పునరుద్దరించి రవాణా సౌకర్యాలు పెంచాలన్నారు.

 

తాజావార్తలు