పోలవరం ఘనత బిజెపిదే
విజయవాడ,సెప్టెంబర్14(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలనే యోచనతోనే తెలంగాణాలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం జరిగిందని బిజెపి నేతలు అన్నారు. ఇలా మొదటి నుంచి భాజపా ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసిందన్నారు. అలాగే రాష్ట్రానికి నిరంతర విద్యుత్తును అందించి పారిశ్రామిక రంగం కుంటుపడకుండా చేసిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతాపార్టీ నేతలు అన్నారు. సీపీఎం, సీపీఐలు ప్రత్యేక ¬దాకోసం ఆందోళనలు చేసి కాంగ్రెస్‌పార్టీకి బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు.