పోలవరం నిర్మాణంపై కొరవడిన చిత్తశుద్ది

కేంద్రం తీరుపై భిన్నాభిప్రాయాలు

నిధుల కేటాయింపులోనూ వివక్ష

అమరావతి,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం జలాశయం పూర్తిచేయాలన్న లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు పునరుద్ఘాటించారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో నరేంద్ర మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరు అనుమానాన్ని కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని వివిధ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్చమంత్రి స్వయంగా ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నా ప్రతి 15 రోజులకు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కేంద్ర మంత్రి చెప్పడం గడ్కరీ చెప్పినా ప్రాజెక్ట్‌ పనులు మాత్రం ముందుకు సాగడంలో సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విభజన సమయంలో పోలవరంను పూర్తి చేసి ఇస్తామని కేంద్రం చెప్పింది. సమస్యల సాకుతో పనులు నిలిపివేయడాన్ని ప్రజలు హర్షించరని అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఇది దేనికి సంకేతమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బిజెపి, టిడిపి నేతలు స్పష్టంగా సమాధానం ఇవ్వడం లేదు. ప్రకటించిన సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాత్రమే వారు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని సరిదిద్దాల్సిన కేంద్రం దానికి భిన్నంగా వాటిని ప్రోత్సహించేలా వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన హావిూ ప్రకారం పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పోలవరానికి ఎంత ఖర్చయితే అంత కేంద్రమే భరించాలని తీర్మానించింది. అయితే, నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారింది. ప్రారంభంలో బాబుకు అనుకూలంగా ఉన్న కేంద్రం ఇప్పుడు ఏ కారణాల చేతనో మోకాలడ్డుతోందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలవరం విషయంలో బిజెపి వాదన మరోలా ఉంది. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో తేడా ఉందని, దానిని కప్పుపుచ్చు కొనేందుకే కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని బిజెపి నేతలు విమర్శించారు. పోలవరం కాంట్రాక్ట్‌ను తమ అనుకూలమైన కంపెనీకి అప్పజెప్పడమే పెద్ద తప్పని విమర్శించారు. ప్రత్యేక¬దా, రాజధాని నిర్మాణంతో పాటు పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ అంశాల అమలులో రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే ధోరణి అవలింబిస్తోందని విపక్ష నేతలు, జనసేన కూడా

ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ స్వయంకృతాపరాధంతో పాటు, కేంద్రం మొదటి నుండి వ్యవహరిచిన విధానం కూడా పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జాతీయ¬దా ప్రకటించిన పోలవరం లాంటి ప్రాజెక్టు పనులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలా అప్పగిస్తారన్న విషయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ప్రశ్నించారు. ఆ సందర్భంగా 2014 ధరల ప్రకారమే నిధులు చెల్లిస్తామని, వాటితోనే ప్రాజెకుట పూర్తవుతుందని కేంద్రం చెప్పడం రాష్ట్ర ప్రజలను తప్పుదోద

పట్టించడమైతే, అటువంటి షరతుకు చంద్రబాబు సర్కారు ఎలా ఒప్పుకుందో అర్ధం కాని విషయం అన్నారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అసలు రాష్ట్రానికి ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పునర్నిర్మాణం వ్యవహారంపై కూడా సందిగ్ధం నెలకోవడం, పోలవరం అథారిటీ సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ అంచనాలు అంతగా ఎలా పెరిగాయో తేల్చాల్సి ఉందనడంపై కూడా ఆయన స్పందించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికే ఈ అంచనాల్ని పెంచారు. అప్పటి నుండి ఏవిూ తెలియనట్లుగా ఉంటూ, రెండేళ్ల తరువాత అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆయన చెప్పారు. పునర్నిర్మాణం, పునరావాసానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పెరిగిన అంచనాలు కలిపితే సుమారు 34 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటన్నిటినీ భరించే స్థితి రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదు. సుమారు 1.98 లక్షల మంది నిర్వాసితుల భవిష్యత్‌ ఏమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.