పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది
భద్రచాలానికి ముంపు ముప్పు పొంచి ఉంది
ఎత్తు తగ్గిస్తేనే వరద ముప్పు ఉండదని వెల్లడి
దీనిపై ఇప్పటికే ఎపికి వివరించామన్న మంత్రి పువ్వాడ
హైదరాబాద్,జూలై19(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు పెంచితే మరింత ప్రమాదం ఉంటుందన్నారు. దీంతో భద్రాచలానికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యలతో కలసి మంగళవారం నాడిక్కడ ఆయన విూడియాతో మాట్లాడారు. పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు. వరద నుంచి శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారని అన్నారు. పోలవరం వల్ల గోదావరి ప్రవాహం స్లోగ వెళ్తోందన్నారు.పోలవరం ఎత్తు
తగ్గించాలని గతంలో ఏపీని కోరామని చెప్పారు.సీఎం రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిశారని అన్నారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలించి శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హావిూ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నామని మంత్రి అజయ్ చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందని చెప్పారు. భద్రాచలం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ తెలిపారు.భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు పువ్వాడ వెల్లడిరచారు. ముంపు వల్ల 840 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వెల్లడిరచారు. ఇప్పటి వరకు 220 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. దాదాపు 72 అడుగుల గోదావరి ప్రవాహం, 25లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. పోలవరం ఎత్తు తగ్గించాలని మేము చాలా సార్లు డిమాండ్ చేశాం. భద్రాచలం కరకట్ట ఎత్తు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరకట్ట నిర్మాణం కోసం నిపుణుల బృందం పంపి త్వరలోనే నిర్మాణం చేపడతాం అని సీఎం అన్నారు. వరదల వల్ల 8 సబ్ స్టేషన్లకు ఇబ్బంది కలిగితే అన్నింటిని పునరుద్ధరించాం. 240 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టామని పువ్వాడ అజయ్ తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ తిరిగి ఇళ్లలోకి వెళ్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. వరదల వల్ల 25వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి నట్లు చెప్పారు. ఇంతటి భారీ వర్షాలకు ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడిరచారు. వరదల వల్ల 8 వేల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాల ఖాతాల్లోకి నేటి నుంచి పరిహారం జమ చేస్తామని పువ్వాడ పేర్కొన్నారు. విూడియా సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.