పోలీసుల దాడులకు నిరసనగా విద్యాసంస్థల బంద్‌

ఆదిలాబాద్‌, జూలై 23 : విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌ మంగళవారం జిల్లాలో విజయవంతం అయింది. సరిసిల్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ ధర్నా సందర్భంగా పోలీసులు అతి ఉత్సహం కనబరస్తూ పోలీసులు తెలంగాణవాదులు లాఠీలతో కొట్టడాన్ని పలువురు ఖండించారు. విద్యార్థి సంఘం ఇచ్చిన బంద్‌కు స్వచ్చందంగా ప్రైవేట్‌ పాఠశాలలు, స్వచ్చందంగా మూసి వేయగా ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు బహిష్కరించారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, బైంసా, ఖానాపుర్‌, ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్‌, శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌ తదితర ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలతో, ధర్నాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైఖ్యవాదులు అందరు కలిసి తెలంగాణపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కుమ్ముక్కై పోలీసులతో తెలంగాణవాదులపై దాడి చేయించిందని వారు ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు విషయమై ప్రభుత్వం, ఇతర పార్టీలు చేస్తున్న చర్యలు అడ్డుకుంటామని వారు హెచ్చంచారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తే తప్ప ఈ ప్రాంతంలో పర్యటించ కుండా అడ్డుకుంటామని అన్నారు.