పోలీసు అమరవీరులకు ఘన నివాళులు…

 

 

 

 

 

 

ఎస్సై రమేష్ బాబు, తిరుపతి ఆధ్వర్యంలో

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ఐలు చిర్ర రమేష్ బాబు,తిరుపతి ఆధ్వర్యంలో కేసముద్రం మండల ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, స్థానిక సర్పంచులు బట్టు శ్రీనివాస్,ప్రభాకర్ పాల్గొనగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్,ఎంపీటీసీ సట్ల వెంకన్న,కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి,రడం శీను,తుంపిల్ల వెంకన్న,తా జొద్దీన్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.