పోలీసు కస్టడీలోకి అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ను పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అంతకుముందు జైలులో అక్బర్‌కు రిమ్స్‌ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.