పోలీసు శాఖలోనే కాదు అన్ని శాఖ లలో పనిచేస్తున్న దిగువ స్థాయి ఉద్యోగుల యదార్ధ గాదే
ఈ మధ్య అనేకమంది మాట్లాడుకుంటున్న , చర్చించుకుంటున్న సినిమా Writer.
దానికంటే ముందు జై భీం సినిమా గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు Writer గురించి మాట్లాడుకుంటున్నారు
ఈ సినిమా యొక్క నేఫథ్యం అలాంటిది
ఒక వ్యక్తి ఉద్యోగమే జీవితంగా పనిచేస్తుంటే పై అధికారుల ఒత్తిడి వల్ల వారు అనుభవిస్తున్న మానసిక వేదన ని గురించి ఈ సినిమాలో తెలియజేశారు.
పోలీస్ యూనియన్ కావాలని చట్టబద్దంగా పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి అక్రమ కేసులో ఇరికించబడ్డ వ్యక్తి కోసం చేసిన అన్వేషణే ఈ సినిమా
ఒకవ్యక్తి వివక్షని ఎదుర్కొని సమాజంలో నిలబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని విశ్వవిద్యాలయాలకు రావడం ఆ విశ్వవిద్యాలయం లో పరిశోధక విద్యార్థి గా చేరడం
అక్కడ పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పోలీసులపై
పరిశోధన ని ఎంచుకోవడం
ఈ నేపథ్యంలో ఉన్నతధికారి వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి వివరాలు తెలియడం దానివల్ల ఆ వ్యక్తిని చంపాలనే ఆలోచనతో పోలీసులు తీసురావడం
అలా తీసుకొచ్చిన తరువాత ఒక పథకం ప్రకారం నక్సలైట్ లతో సంభందాలు ఉన్నాయని తన మీద UAPA పెట్టి చంపాలని చూడడం దానివల్ల ఈ కేసుల విషయం ని కనుమరుగు చేయాలని చూడడం ఇదంతా సినిమా లో జరిగిన సన్నివేశం.
కేవలం అమ్మాయి యొక్క కులాన్ని బట్టి అమ్మాయిని గుర్రపు స్వారీ ఎంపిక కు నిరాకరించడంలో స్పష్టంగా పోలీసు ఉన్నతధికారుల్లో ఉన్న కుల కోణాన్ని ఈ సినిమాలో చూపెట్టారు..!
ఆ సన్నివేశంలో మీ జాతిలో మగవాళ్లని కూడా గుర్రపు స్వారీ చేయనివ్వను అలాంటిది నువ్వు గుర్రపు స్వారీ చేస్తవా అని మహిళా కానిస్టేబుల్ పై దాడిచేయడం పట్ల ఉన్నతాధికారుల వివక్ష ని చూపెట్టారు
అలానే ఒక రైటర్ గా నిజాయితీ గా పనిచేసి అమాయకున్ని రక్షించే ప్రయత్నం చేసినందుకు తన చేతితోనే ఆ వ్యక్తిని బలవంతంగా ఎన్కౌంటర్ చేయించడం
మల్లీ అధికారంతో చేసిన తప్పుని దాచమని ఒత్తిడి చేయడంతో ఆ మానసిక భాదని , ఒత్తిడిని తట్టుకోలేక ఉన్నతధికారిని చంపేయడం సినిమా యొక్క పూర్తి సారంశం.
ఇలా పోలీసు అధికారుల యొక్క భాధని వివరించే ప్రయత్నం సినిమా ద్వారా చేశారు.
వాస్తవానికి ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి
వాస్తవానికి ఇది సినిమా కాదు, మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనల సారాంశం అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు అనేది మనం గ్రహించాలి. ఈ సందర్భంగా అలాంటి సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన విషయం మనం ఒకసారి యాది చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసిఆర్ గారి సొంత జిల్లాలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్ లు ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అందులో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ లు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర పోలీస్ శాఖ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆ మరణించిన అధికారుల కుటుంబాలకు కనీసం అండగా ఉండకపోవడం శాఖ లోని ఎంతో మందిని కలచి వేసింది అనేది బయటకు చెప్పలేని నిజం.
అలాగే దుబ్బాక సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్ తో తన భార్యని కాల్చి తరువాత తనని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా పెద్దయెత్తున ఉన్నతధికారులమీద ఆరోపణలు వచ్చాయి
రాష్ట్రంలోని ప్రధాన మీడియాలో, పత్రికల్లో, సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఉన్నతధికారులను విధులనుంచి తొలగించాలని నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి.
ఇవి కొన్ని మాత్రమే బయటకు వచ్చినవి , మనం ప్రత్యేక్షంగా చూసినవి. ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర నిత్యం జరిగినా వీటిమీద స్పందించిన గొంతుకలు చాలా తక్కువ.
ఇక్కడ మీతో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలీ అనుకుంటున్న
పోలీస్ శాఖలో హక్కులకోసం మాట్లాడి
పుస్తకంరాసినందుకు ( మాదిగ కాకి) వరకుమార్ అనే కానిస్టేబుల్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ కూడా విధించిందీ.సస్పెన్షన్ పూర్తయిన తరువాత తిరిగి విధుల్లోకి వచ్చాక అనేక సందర్భాలలో మల్లీ తనయొక్క ఆవేధన ని తెలియజేయడం చూసాము
తన యొక్క ఆవేదనని తెలియజేయడం చూస్తే పోలీస్ శాఖ లోని నిర్భందం, హక్కుల ఉల్లంఘన ఎలా ఉంటుంది అర్దం చేసుకోవచ్చు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఆవేధనని మనతో పంచుకోవడం చూసాము.
ఇలా ఎంతోకొంత వాళ్ల భాదలను తెలుపుతున్న ప్రభుత్వం యొక్క నిర్భంధం అమలవుతూనే ఉందీ.
కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ తన ఆవేదన నీ మీడియా ముందే మనతో పంచుకోవడం తెలిసిందే. ఇలా ఎంతో కొంత మంది వాళ్ళ బాధలను తెలుపుతుంటే వారి మీద ప్రభుత్వ నిర్భందం అమలు అవుతున్న కూడా మనం వారికి మద్దతుగా నిలవకపోవడం కూడా వారిని మరింత కలచి వేస్తుంది.
నిత్యం పోలీస్ కొలువులు మాత్రమే విడుదల చేసే ప్రభుత్వాలు, పోలీస్ బలగాలను ప్రభుత్వాన్ని, పాలకులను కాపాడటం కోసమే వాడుకుంటున్న సందర్భాలే కనిపిస్తున్నాయి తప్ప వారికి పూర్తిగా ప్రజల రక్షణ కోసం పని చేసే విధంగా తయారు చేయలేకపోతున్నాయి
అప్పుడప్పుడు మనల్ని కదలించడంకోసం వస్తున్న ఇలాంటి సినిమాలపై మనం విశ్లేషణలు చేయాలి.
తమిళనాడు లో జరిగిన పోరాటలు సామాజిక నేపథ్యాల అక్కడి చైతన్యం వల్ల మనం ఈ తరహా సినిమాలను చూడగలుగుతున్నాం
తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు రావాలీ.
సమాజ చైతన్యానికి దోహాదపడాలి.
వాటివలన అయినా ఎంతోకొంత ప్రభుత్వం లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కనీసం ప్రజలకైనా వారు అనుభవిస్తున్న భాదలు తెలిసే అవకాశమైనా ఉంటుందీ
– శివకుమార్ నాస్తిక్ (8367419582)
న్యాయ విద్యార్థి
కాకతీయ విశ్వవిద్యాలయం
|