పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా

నల్గొండటౌన్, జనంసాక్షి :(అక్టోబర్ 22)

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ కార్యక్రమం టూ టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని, లైన్స్ క్లబ్ వారు ప్రతి రోజు అన్నదానం దాతల సహాయంతో నిర్వహిస్తూ ఎంతో మందికి పేదవారికి, ఆకలి బాధను తీర్చే వారి మనసు గొప్పదని దీనికి కృషి చేస్తున్న లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సైదులు సిబ్బంది ఏఎస్ఐ కాసిం, శంకర్ ,బాలకోటి, సత్యనారాయణ, స్వామి,అనిల్, ఉమారాణి అలాగే లైన్స్ క్లబ్ నిర్వాహకులు సతీష్ కోడె, పుల్లారావు,శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.