పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : పద్మావతి నగర్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం రాధిక అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మాహత్యకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఆమెను రుయా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రెండో పెళ్లి చేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తోన్న భర్తపై ఫిర్యాదుచేసేందుకు వచ్చిన తనను పోలీసులు అవహేళన చేశారని బాధితురాలు రాధిక ఆరోపించారు. పోలీసుల తీరు వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వివరించారు.



