పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు పై వెంటనే చర్యలు చేపట్టాలి. -జిల్లా ఎస్పీ కె. సృజన.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 జనం సాక్షి.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదుపై త్వరితగతిన విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిష్కరించాలని, సివిల్ వివాదాలు పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్నీ పిర్యాదులకు తెలియజేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కె.సృజన పోలీస్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చిన 6 అర్జీలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా వైర్లెస్ సెట్లో లో మాట్లాడి బాధితుల ఫిర్యాదులను వెంటనే విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిష్కరించాలని, సునిశితమైన అంశాలకు సంబంధించిన పిర్యాదుల విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, సివిల్ వివాదాలకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు అయినా కోర్టు ద్వారానే పరిష్కరించుకునేటట్లు పిర్యాదు దారులకు తెలియజేయాలని సూచించారు. సోమవారము వచ్చిన పిర్యాదుల లో భూ వివాదాలకు సంబందించి 3, చీటింగ్ కు సంభందించి 1,ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు ఆమె తెలిపారు.