పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి
ములుగు జిల్లా
గోవిందరావుపేట అక్టోబర్ 13 (జనం సాక్షి) :-
పోషణ లోపం ఉన్న పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ పల్లి పట్టి నువ్వల పట్టి బిస్కెట్ స్ గ్రామసర్పచ్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ సుమతి అందచేశారు ఈ కార్యక్రమం లో అరుంధతి మోక్ష అలివేలు తల్లులు పద్మ మంజుల పాల్గొన్నారు రెండ్ల సంతోష్ పాల్గొన్నారు.పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని చల్వాయి గ్రామ సర్పంచ్ ఈ సం సమ్మయ్య అన్నారు.గురువారం గోవిందరావుపేట మండలం పరిధిలోని చల్వాయి గ్రామంలో అంగన్వాడీ మూడవ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం అవగాహన సదస్సులో వారు పొల్గొని మాట్లాడారు.పోషణ పోషకాహార విలువలపై చిన్నారులకు అవగాహన కల్పించనున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆరేళ్లలోపు చిన్నారులకు రక్తహీనత సమస్య నుండి కాపాడేందుకు వైద్య శాఖ సమన్వయంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రతీ నెల మొదటి వారంలో అంగన్వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఎత్తు,బరువుల కొలతలు తీసి పోషణ లోపమున్న పిల్లలను గుర్తించి,సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు విటమిన్లు,మినరల్స్,అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఈ సం సమ్మయ్య సూపర్వైజర్ సుమతి అందచేశారు ఈ కార్యక్రమం లో అరుంధతి మోక్ష అలివేలు పద్మ పాల్గొన్నారు రెండ్ల సంతోష్ పాల్గొన్నారు .
Attachments area