పౌరసరఫరాలో పోర్టబులిటీ విధానం

సానుకూలంగా మారిన నిర్ణయం

గుంటూరు,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఇకపై రాష్ట్రంలోని ఏ చౌక డిపో నుంచి అయినా దఫదఫాలుగా రేషన్‌ సరుకులు పొందే వెసులుబాటు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ విధానం ఇంతకు ముందే అమల్లోకి వచ్చినా ముందుగా విజయవాడ నగరంలో పరీక్షించిన తరువాత ఇతర జిల్లాల్లో ఎంపిక చేసిన రేషన్‌దుకాణల్లో అమల్లోకి తీసుకొచ్చారు. వృద్దులకు ఇంటి వద్దకే రేషన్‌, ఆన్‌లైన్‌లో రేషన్‌ అందించడం వంటివి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ప్రజలకు ప్రభుత్వం పథకాలను చేరువ చేస్తోందని అన్నారు. దీంతో రేషన్‌ సరుకులు పొందడంలో సౌలభ్యం లభించింది. ఈ విధానం మంచి ఫలి తాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని చౌకధరల డిపోల్లో అమల్లోకి తీసుకువచ్చినట్లు పౌరసరఫ రాల శాఖ జిల్లా అధికారులు తెలిపారు. ఇ-పాస్‌ ప్రారంభమయ్యాక సంబంధిత కార్డుదారుడు జిల్లాలోని రేషన్‌దుకాణాల్లోనే నెలవారీ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉండేది. సమయానికి సదరు రేషన్‌దుకాణదా రుడు అందుబాటులో లేకపోవడం, ఇ-పాస్‌ యంత్రాలు సరిగా పని చేయకపోవడం, దుకాణం చేరుకోవాలంటే దూరప్రయాణం చేయాల్సి రావడం, సరుకులు అన్నీ ఒకే కాలంలో అందుబాటులో ఉండకపోవడం వంటి పలు ఇబ్బందులు కార్డుదారులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అమ ల్లోకి వచ్చిన పోర్టుబులిటీ విధానం వల్ల రాష్ట్రంలోని ఏ

ప్రాంతానికి చెందిన కార్డుదారుడైనా ఏ ప్రాంతంలో అయినా సరుకులు తీసుకోవచ్చు. అదీ సరుకులన్నీ ఒకేసారి కాకుండా సొమ్ము అందుబాటులో ఉన్న సమయంలో దఫదఫాలుగా తీసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో తమకు అందుబాటులో ఉన్న దుకాణాల నుంచి రేషన్‌ సరుకులు తీసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పోర్టుబులిటీ విధానం వల్ల అటు డీలర్లకు, ఇటు లబ్దిదారులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంలో కొన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మందుగా మొత్తం సరుకులో 10 శాతం సరుకులు తమ దుకాణ పరిధిలోని కార్డుదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం మించి పోతే సంబంధిత అధికారులు మరికొంత మొత్తంలో సరుకులను సంబంధిత దుకాణానికి చేరవేస్తారు. దీనివల్ల సంబంధిత దుకాణదారుడుకి నెలవారీ సరుకులపై వచ్చే కవిూషన్‌ మొత్తం బాగా పెరిగి ఆదాయం బాగుంటుంది. దీనివల్ల దుకాణదారులు ఎక్కువ మందికి సరుకులు అందించడానికి ప్రయత్నాలు చేస్తారని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి అభిప్రాయపడుతున్నారు.

తాజావార్తలు