పౌర సమాజమా మేలుకో!

నిశ్శబ్దంగా ప్రాణాలు

గాలిలో కలిసిపోతున్నాయి

కడ చూపుకు నోచుకోక

దేహాలు కాటిలో కాలుతున్నాయి

ఆశ తెగిన వలస పక్షులు

సొంత గూటికి నడక సాగిస్తున్నాయి

లోకం తెలియని పసి ప్రాయాలు

ప్రశ్నార్తకంగా మిగులుతున్నాయి

ఇపుడు…

ప్రపంచం చింతల శిభిరం

బతుకు అంధకార బంధురం

అంతటా….

చిక్కనౌతున్న కరోనా మేఘం

మోగుతున్న మృత్యు నాదం

అయినా..

ఎవరిలో ఏ స్పందనా లేదు

నాకేం కాదన్న అహం వీగిపోదు

శత్రువు సహజీవనమేనని తెలిసినా..

ఏ అప్రమత్తత కాన రాదు

ఎవడికైతే నాకెంటనే భావన తరిగిపోదు

ఎక్కడ చూసినా సమూహా సందళ్ళు

నియమోల్లంఘనల విదృశ్యాలు

ఈ నిర్లక్ష్య తంతు ఇలాగే సాగితే

మానవాలి మరుగున పడ్డ అవశేషం

యావత్ ప్రపంచం చిమ్మచీకటి ఖండం

ఇకనైనా….

పౌర సమాజం మేల్కొనాలి

బాధ్యతనెరిగి మసలుకోవాలి

కలిసికట్టుగా”కరోనా”ను తరిమేయాలి

             “””””””””””””””

(కరోనా అంతానికి  పౌర సమాజాన్నీ మేల్కొలుపుగా…)

 

                            కోడిగూటి తిరుపతి

                            Mbl no:9573929493