ప్యాకేజీ ప్రకటించినప్పుడు కావాలని..
ఇప్పుడు మాటమార్చారు
– కేంద్రం విధానాలతోనే ఏపీకి ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానం
– భోగాపురం ఎయిర్‌పోర్టుకు అడ్డుపుల్ల వేస్తోంది చంద్రబాబే
– చలసాని, శివాజీలను నడిపించేది చంద్రబాబే
– 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తాం
– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
విజయనగరం, జులై18(జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు సీఎం చంద్రబాబు దాన్ని అర్థరాత్రి అంగీకరించారని.. ఇప్పుడు తన స్వలాభంకోసం మాటమార్చారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 2019 ఏప్రిల్లోనే ఎన్నికలు రావాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సరళీకృత వాణిజ్య విధానాల వల్లే
ఏపికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటిస్థానం వచ్చిందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అడ్డుపుల్ల వేస్తోంది చంద్రబాబే అని ఆరోపించారు. కేంద్రం నిధులతోనే తోటపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని సోమువీర్రాజు అన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని, తమ నిజాయితీని శంకించొద్దని సోమువీర్రాజు తెలిపారు. ప్రత్యేక ¬దా విషయంలో చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీలను నడిపిస్తోంది చంద్రబాబేనని, ఆయన తెరవెనుక ఉండి వారితో మాట్లాడిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని అన్నారు. విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, జాతీయ రహదారి, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు. టీడీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగ ఉన్నారని వీర్రాజు హెచ్చరించారు.