ప్రకటనలకే పరిమితమైన అంగన్వాడీ ఉద్యోగాలు
వెంటనే భర్తీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ డిమాండ్
గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): అంగన్వాడీ కేంద్రంలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎమ్మెస్ భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో టీచర్ ఆయా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. గత సవంత్సరం తెలంగాణ ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ ఆయా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసి సంవత్సరం పూర్తి అయిన ఆ ప్రకటనలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. పదవ తరగతి పాసైన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి సర్టిఫికేట్ వేరిపీకేషన్ పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగాలను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Attachments area