ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. – బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.
1) మొక్కలు నాటుతున్న ఏసీపీ.
2) వాహనాల పార్కింగ్ ప్రారంభిస్తున్న ఏసీపీ.
బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి )
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. బుధవారం ఆయన నెన్నెల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం పోలీస్ స్టేషన్లో సిబ్బంది కోసం నిర్మించిన వాహనాల పార్కింగ్ షెడ్ ను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లోని పాత క్వార్టర్సు ఖాళీ స్థలంలో నూతనంగా ఏర్పాటుచేసిన మామిడి తోటలో ఏసీపీ, బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్, చుట్టూ పరిసరప్రాంతాలను పరిశీలించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి, ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5ఎస్ ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలన్నారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉంది మెరుగైన సేవలు అందించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిసీటిఎన్ఎస్ (క్రైమ్ మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్& సిస్టం) ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని. పోలీస్ అధికారులకు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ఎంఎస్ గ్రీవెన్స్ సెల్ ద్వారా పంపించాలని హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, రోజుకు ఒకసారి హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న సర్వీస్ రికార్డ్స్ ను లీవ్ తదితర అంశాలను చెక్ చేసుకోవాలని ఏసీపి గారు సూచించారు. ఆయన వెంట ఎస్సై ఎస్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.