ప్రజలతో మమేకమవుతున్న డాక్టర్ జి.రవి..

ఇల్లందు జూలై 27 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జి రవి విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇల్లందు నియోజక వర్గo ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. జి .రవి.ఈ సందర్భంగా వారు కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ప్రకటించిన మేలును గురించిన (డిక్లరేషన్ )సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ 2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ధరణి పోర్టల్ రద్దుచేసి పోడు భూములకు పట్టాల పంపిణీ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, చేయూత పథకం కింద వృద్ధులు వికలాంగులు ,వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు నెలకు 4000 రూపాయల పెన్షన్,తెల్ల కార్డున్న ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు అన్ని జబ్బులకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్యం, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం & ఇందిరమ్మ ఇల్లుల మంజూరు, ప్రతి పేద కుటుంబానికి 9 రకాల నిత్యావసర సరుకుల (రేషన్) పంపిణీ , నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్, తెలంగాణ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25 వేల గౌరవ పెన్షన్, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతీకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత, కేజీ టు పీజీ ఉచిత విద్య, తదితర సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని వారు ప్రజలకు వివరించారు. తెలంగాణలో ప్రజా సంక్షేమo బాగుండి ,సమ సమాజ స్థాపన జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని ,కావున ప్రజలందరూ రానున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా పారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వీరు, శోభన్, రాంబాబు,ప్రసాద్,రాందాస్,చందర్,అనిల్,ఆనంద్,జగన్,రాము,బాలకృష్ణ,వినోద్ ,ఇల్లందు పట్టణ మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, పసిక తిరుమల్,రవి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు