బస్టాండ్ ను మెరుగుపరచి ప్రయాణికులకు సేవాలందించండి -బీజేవైఎం అధ్యక్షులు ఎడ్ల రాజశేఖర్

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్25(జనంసాక్షి)

మండల కేంద్రంలోని బస్టాండ్ మరుగున పడిందని దానికి మెరుగులు దిద్ది బస్సు వేళలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా గార్ల మండల అధ్యక్షులు ఎడ్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. గతంలో బస్సు సేవలు మండలానికి అద్భుతంగా ఉండేవని జిల్లా ఏర్పడి ఏళ్ళు గడుస్తుంటే జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోగా బస్టాండ్ కూడా మరుగున పడి ప్రయివేట్ పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇటీవల డిపో మేనేజర్ కు గార్ల ప్రజల సూచనల ప్రకారం ఖమ్మం నుండే కాకుండా జిల్లా కేంద్రం నుండి కూడా బస్సులు ఏర్పాటు చేయడం అభినందనియమైనా ఆ బస్సులు నిలిపేందుకు బస్సు సమయాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయలేకపోవడం దౌర్భాగ్యం అన్నారు. కరోనా సమయం నుండి రైలు సౌకర్యం తగ్గిపోయి ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు అటు ఖమ్మం ఇటు మహబూబాబాద్ వెళ్లాలంటే నానా ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. బస్సు సౌకర్యం కలిగినప్పటికి ఆ బస్సు ఎప్పుడొస్తుందో, ఎక్కడ అగుతుందో తెలియక చాలామంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారని వారికి ప్రయాణ సౌకర్యం అందించేలా బస్టాండ్ను పునర్ప్రారంభించి బస్సు సేవలు అందించాలని బస్సుల సమయాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు.