ప్రజలు వారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా వ్యాప్తంగా గడిచిన కొద్దీ రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.కరోనా వంటి అంటువ్యాధుల కాలంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తూ అనేకచోట్ల నీరు నిల్వ ఉండడంతో మలేరియా,డెంగ్యూ వంటి దోమలు విపరీతంగా అభివృద్ధి చెంది ప్రజలను రోగగ్రస్తులను చేస్తున్నాయి. మలేరియా,డెంగ్యూ వంటి వైరల్ వ్యాధుల కేసులు బాగా పెరిగాయి. శిలీంధ్రాలు,బహిరంగ ఆహారం తినకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు, కలుషిత నీరు వలన చర్మ వ్యాధులు పెరుగుదల కూడా ఉంది. జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. మలేరియా,డెంగ్యూ వ్యాధి లక్షణాలు కరోనా లక్షణాలతో సమానంగా ఉంటాయి. కాబట్టి, ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లాంటి అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రోడ్ల మీద వుండే పాని పూరి,ఇతరత్రా వాటికి దూరంగా ఉండి పరిశుద్ధం చేసిన నీటిని, గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలని రామచంద్రుని పేట యూత్ సభ్యులు దివాకర్ రెడ్డి ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రజలు వారి ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని,ఇటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని వారు ప్రజలనుకరారు.