ప్రజల్లో వందశాతం సంతృప్తి రావాలి

– ప్రాధాన్య క్రమంలో పనులు చేపడితే ఫలితం సాధించగలం
– అధికారులంతా గ్రామాలకు వెళ్లాలి
– నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చామో ప్రజలకు వివరించాలి
– వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుతున్నాం
– మరో పదిరోజుల్లో శ్రీశైలం నిండుతుంది
– పట్టిసీమతో రాయలసీమకు పూర్తిస్థాయిలో నీరిస్తున్నాం
– ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకుంటూ ముందకెళ్లాలి
– ¬దా ఇచ్చుంటే వేగంగా అభివృద్ధి చెందేవాళ్లం
– ఐక్యంగా పనిచేస్తే బెస్ట్‌ స్టేట్‌గా ఏపీని నిలబెట్టగలం
– అధికారులు, మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జులై25(జ‌నంసాక్షి) : పాలనపై ప్రజల్లో వందశాతం సంతృప్తిని సాధించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, ప్రాధాన్య క్రమంలో పనులు చేపడితే ఫలితం సాధించగలమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం అధికారులు, మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విభజన తర్వాత నెలకొని ఉన్న ప్రతీ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు.  వృద్ధిరేటులో ఏపీ స్థిరంగా నెంబర్‌వన్‌గా నిలుస్తోందని, అంతిమంగా అత్యధిక ప్రజా సంతృప్తి శాతం ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీకి కేంద్రం సహకరించడంలేదని, ¬దా ఇవ్వడంలేదని అన్నారు. ¬దా ఇచ్చి వుంటే వేగంగా అభివృద్ధి చెందేవాళ్లమని బాబు పేర్కొన్నారు. ఇదేవేగంతో ఏడేళ్లు కష్టపడితే దక్షిణాదిన ఆదాయంలో వృద్ధి చెందుతామని అధికారులతో చంద్రబాబు అన్నారు. గత ఏడాది వర్షపాతం తగ్గినా వృద్ధిరేటు తగ్గలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ మరో పదిరోజుల్లో నిండుతుందని తెలిపారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు పూర్తిస్థాయిలో నీరిస్తున్నామని, వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుతున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రజల్లో నూటికి నూరు శాతం సంతృప్తి రావాలని, ప్రాధాన్య క్రమంలో అనుకున్నది చేయగలిగితే ఫలితాలు వస్తాయని అన్నారు. ఈనెల 16న గుంటూరులో గ్రామదర్శిని ప్రారంభించామని, అధికారులంతా గ్రామాలకు వెళ్లి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చామో ప్రజలకు వివరించాలని తెలిపారు. ఓడీఎఫ్‌ ప్రకటించామని, నూరుశాతం గ్యాస్‌ ఇచ్చామని అన్నారు. శిశువులు తక్కువ బరువుతో పుట్టకుండా గర్భిణులకు పౌష్టికారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సుస్థిర అభివృద్ధి దిశగా ప్రణాళిక రచించి అమలు చేస్తున్నామన్నారు. పద్ధతి ప్రకారం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ను ప్రోత్సహిస్తున్నామని, అందరం సమన్వయంతో పనిచేద్దామని  అన్నారు. అన్న క్యాంటిన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రన్న కానుక, అన్న క్యాంటిన్లు, ఎన్టీఆర్‌ వైద్య సేవలు, మధ్యాహ్న భోజన పథకాలపై సంతృప్తి శాతాలు బాగున్నాయని సీఎం తెలిపారు. ఉద్యోగ కల్పనకోసం
ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నామని, ఐదు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.

తాజావార్తలు