ప్రజల ఆకాంక్ష తెలంగాణ పట్టించుకోకుండా దండయాత్ర
హైదరాబాద్, అక్టోబర్ 23(జనంసాక్షి) :
బలవంతులు దుర్భల జాతిని బానిసలు గావించారు..ఒక జాతి వేరొక జాతిని పీడించే సాంఘీక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు..అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో జార్జిబుష్ వేలాది మంది సైనికుల భద్రత నడుమ అఫ్గనిస్థాన్‌లో పర్యటించేవాడు..ఇపుడు అచ్చంగా టీడీపీ అధినేత ‘బాబు’ కూడా మన తెలంగాణలో గిట్లాంటి దండయాత్రే చేస్తుండు..తెలంగాణపై తమ అభిప్రాయంమేంటో చెప్పకుండా వందలాది మంది ప్రైవేటు సైన్యం నడుమ దండయాత్ర చేస్తుండు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష..ఆశ, శ్వాస..స్పష్టత ఇవ్వమంటే సచ్చేటట్లు కొడుతున్నారు.. అడ్డుకొంటమంటే అరెస్ట్‌లు చేయిస్తున్నరు..తద్వారా నిరసన తెలిపే తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నరు..ఓ ప్రాంతంలో పర్యటించేటపుడు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ప్రవర్తించాలి..కానీ వస్తున్నా మీకోసం అంటూ యాత్ర చేస్తున్న బాబు తెలంగాణ ప్రజల నినాదాన్ని పట్టించుకోవడం లేదు..ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభీష్టాలకు వ్యతిరేకంగా ‘నడుస్తున్నడు’. తెలంగాణపై వైఖరి చెప్పాలంటే తెలంగాణకు వ్యతిరేకం కదదంటున్నడు..కానీ ఎక్కడా తెలంగాణకు అనుకూలమని చెప్తలేడు..చిదంబరం డిసెంబర్ 9 ప్రకటనకు ముందు కూడా బాబు గట్లనే అన్నడు..కానీ తెలంగాణపై ప్రకటన వెలువడంగనే రాత్రికి రాత్రే తెలంగాణపై ఎట్ల నిర్ణయంతీసుకుంటురన్నడు..అందుకే నేను తెలంగాణకు వ్యతిరేకం గాదు అంటున్న బాబును తెలంగాణ ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదు..తెలంగాణపై ఆయన వైఖరి వల్లే యువకుల బలిదానాలు జరిగినా ఒక్క నాడు తెలంగాణలో పర్యటించి వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు…కానీ ఇపుడు వస్తున్నా మీ కోసం అంటూ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నడు..తెలంగాణపై తన వైఖరి చెప్పకుండా అడుగుపెడితే అడ్డుకొంటమని హెచ్చరిస్తే ధీటుగా ఎదుర్కొంటమని టీడీపీ నాయకులు చెప్పడం తెలంగాణపై బాబు వైఖరికి నిదర్శనం..తెలంగాణపై ఏదో ఒక వైఖరి చెప్పమంటే చిదంబరానికి లేఖ రాశానని, ఇప్పటికే వైఖరి స్పష్టం చేశానని సెెలవిస్తున్నాడు బాబు…ప్రజల మనోభావాలను గౌరవిచండమే ప్రజాస్వామ్యం అంటే..కానీ బాబు తెలంగాణపై తన వైఖరి చెప్పకుండా తెలంగాణలో తిరిగితే అర్థం లేదు..ఇక ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నా మీ కోసం అంటున్న మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలకు తమ పార్టీయే కారణమని మరిచిపోయిండు..మహబూబ్‌నగర్ రైతుల కోసం నీర్మించిన రాజోలి బండను గుదిబండగా మార్చింది బాబే..87,500 ఎకరాలకు సాగు నీరందించాల్సిన ప్రాజెక్ట్‌ను తెలంగాణకు ఉపయోగకుండా మార్చింది ఆ పార్టీ నేతలే..రాయలసీమ యూత్ సర్వీసింగ్ సొసైటీ పేరుతో రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డీఎస్ తూములను పేల్చేసిండు..దాని గురించి బాబు ఎక్కడా కూడా మాట్లాడడం లేదు..బాబు ప్రజా క్షేమం గురించి మాట్లాడాలనుకొంటే ఆర్డీఎస్‌కు పడిన రంధ్రాల గురించి మాట్లాడాలె..సాగు నీరు విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రశ్నించాలె..అవన్నీ మరిచి పోయి తెలంగాణలో అడుగుపెడితే దానికి అర్థం లేదు…ఘనత వహించిన బాబు అసెంబ్లీలో తెలంగాణ అనొద్దని, వెనుకబడిన ప్రాంతంగా పిలవాలని సూచించిన బాబు తెలంగాణపై అదే వైఖరి కొనసాగిస్తున్నడు..తెలంగాణ కావాలంటున్న ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా ప్రజాసామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నడు…ఇదేమని అడిగితే తెలంగాణవాదులపై చంద్రదండు విరుచుకు పడుతున్నరు..తాను అధికారంలో ఉన్నపుడు పట్టించుకోని బాబు ఆర్డీఎస్ ఆయకట్టు గురించి ప్రభుత్వానికి లేఖ రాయడం విడ్డూరమే..మహబూబ్‌నగర్‌ను ఆదర్శ జిల్లాగా మారుస్తామంటూ బీరాలు పలుకుతన్నడు..ప్రజల ఆకాంక్షలు తెలుసుకోకుండా ఎట్ల యాత్ర చేస్తవు అని తెలంగాణవాదులు ప్రశ్నలు సందిస్తున్నా..తెలంగాణలోకి నువు అడుగుపెట్టొద్దంటూ ప్రజలు నిరసన తెలుపుతున్నా సిగ్గు లేకుండా తెలంగాణలో యాత్ర చేస్తున్నడు…కడుపుల లేనిది కౌగలించుకుంటే వస్తదా అన్నట్లు తెలంగాణపై మనసులో మాట, బయటకో మాట చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు..ఓ బాబు తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య పోరాటాన్ని కళ్ల్లుంటే చూడు మనసుంటే విను..ఇక నీ ఆటలు సాగవు..ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టత ఇవ్వు..ఆ తర్వాతే తెలంగాణలో యాత్ర చేసుకో..లేకుంటే తెలంగాణ ద్రోహిగా చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతావు..