ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.సోమవారం నూతన ఐ డి ఓ సి సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ధరణి సమస్యలపై, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల పై మొత్తం 76 పిర్యాదులు అందాయని , ధరణికి సంబందించినవి,69 , పెన్షన్ 5 దరకాస్తులు,వివిధ సమస్యలపై 2 వచ్చిన దరకాస్తులను సంబందిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరామయ్యేలా చూడాలని అధికారులకు తెలిపారు. ప్రజా ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత మండలాల తహసిల్దార్లు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్క రించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, ఆర్ డి ఓ చంద్ర కళ, సుబ్రహ్మణ్యం తాసిల్దార్ సుబాష్, ఏ ఓ బద్రప్ప జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.