ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదం
నూటికి నూరుశాతం పన్ను వూళ్లకు చైతన్యం
సిరిసిల్ల ఆదర్శ నియోజకవర్గంల మంత్రి కెటిఆర్ కృషి
కరీంనగర్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో సరికొత్త కార్యక్రమానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయితీలను అర్ధికంగా బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా అడుగులు వేయాలని సంకల్పించారు. గ్రామ పంచాయితీల్లో వందశాతం పన్నులు వసూలుకి శ్రీకారంచుట్టారు. ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇందులో బాగంగా ముందుగా తన సిరిసిల్ల నియోజకవరన్గాన్ని మోడల్‌గా తయారు చేస్తున్నారు. ఇది ఇతర పట్టణాలకు లేదా గ్రామాలకు ఆదర్శంగా ఉండేల చేస్తున్నారు. పన్నులతో గ్రామాల్లో మరింత మెరుగ్గా తాగునీటి, పారిశుధ్య, విద్యుత్ సేవలు అందించాలని ప్రచారం చేపట్టనున్నారు. పంచాయితీలకి అధికారాలతోపాటు భాధ్యతలు అప్పజేప్పేందుకే ఈ కార్యక్రమన్న మంత్రి త్వరలో మంత్రులకి, ప్రజాప్రతినిధులకి లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. వెనకబడిన గ్రామాలవృధ్దికి ఇప్పటికే పల్లెప్రగతి వంటి కార్యక్రమానికి, ఈ-పంచాయితీ వంటి అలోచనలకి శ్రీకారం చుట్టిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు, గ్రామాల అభివృద్ధికి మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్ధానిక సంస్ధలని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం, గ్రామాల్లో భాధ్యతాయుతమైన విధంగా గ్రామాపంచాయితీలు తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించేలా…..గ్రామాల్లో వందశాతం ఇంటి పన్ను, ఇతర పన్నులను వసూలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామా పంచాయితీ వ్యవస్ధ నిజమైన స్పూర్తిని, తమ గ్రామాభివృధ్దిలో గ్రామపౌరుల భాగసామ్యాన్ని, పేంచేలా ఈ పన్నుల చెల్లింపు కార్యక్రమాన్ని తన సొంత నియోజకవర్గం సిరిసిల్లా నుంచే ప్రారంభించారు. గ్రామపంచాయితీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇతరులకి చెప్పేముందు పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ముందు తన నియోజక వర్గంలోని అన్ని గ్రామాలల్లో ఇంటి పన్ను, ఇతర పన్నులను వంద శాతం చెల్లించే కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని దాదాపుగా పూర్తి చేశారు. చెల్లించిన ప్రతి పైసా ప్రజలకే చెందుతుందన్న నమ్మకం కల్పిస్తే ప్రజలు పన్నులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారన్న మంత్రి, ఈ దిశగా ప్రజల్లో నమ్మకం పెంచేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామాల్లోని సర్పంచ్లు, గ్రామా కార్యదర్శులు, గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి పన్నులు కట్టడం ద్వార కలిగే ప్రయోజనాలను స్వయంగా వివరిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తాము భారీగా నిధులు ఇస్తున్నామని, అయితే గ్రామాల్లోని పారిశుద్యం, నీటిసరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస పౌరసేవలను మరింతా మెరుగ్గా, ప్రభావవంతగా నిర్వహించేందుకు ఈ పన్నులు ఉపయోగపడతాయని మంత్రి వారికి తెలుపుతున్నారు. ప్రజలు కట్టిన పన్నుల , వాటి ఖర్చు వివరాలను పారదర్శకంగా ఉంచేదుకు సమగ్ర వివరాలను గ్రామపంచాయితీ కార్యాలయాల్లో ప్రజలకి అందుబాటులో ఉంచుతామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విూ పన్నులతోనే పనులు జరుగుతున్నాయన్న బోర్డులు ఏర్పాటు చేస్తారని, దీని వల్ల ప్రజలకి ప్రతిసారి తాము, తమ అభివృద్దిలో భాగస్వాములౌతున్నమన్న భావనకలుగుతుందని, అలాంటే ప్రయత్నమే తాము చేయబోతున్నట్టు మంత్రి తెలిపారు. పంచాయితీలకి అధికారాలను ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని,అయితే పంచాయితీలు అధికారాలతోపాటు తమ విధులను, భాద్యతలను సైతం నేరవేర్చేందుకు సిద్దంగా ఉండాలన్నదే తమ అభిమతమే ఈ పన్నుల చెల్లింపుల కార్యక్రమానికి పునాది అని మంత్రి తెలిపారు. కేవలం కాగితాల విూద అధికారాలను కల్పించి చేతులు దులుపుకుంటే సరిపోదని, నిజమైన గ్రామా స్వరాజ్యం వైపు అడుగులు పడాలంటే, గ్రామపంచాయితీలను అర్ధికంగా బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని మంత్రి తెలిపారు.తన నియోజక వర్గంలో దాదాపుగా వందశాతం ఇంటి పన్ను వసూలు లక్ష్యాన్ని పూర్తి చేసిన మంత్రి కె.తారక రామారావు త్వరలోనే జిల్లా మెత్తానికి విస్తరించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం మంత్రులకి, ప్రజాప్రతినిధులకి ప్రత్యేకంగా లేఖలు రాయనున్నారు. గ్రామాల్లో మరింత మెరుగైన సేవలకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజలకి భరోసా కల్పిస్తూ పన్నుల వసూలుకి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరనున్నారు. సిరిసిల్లాలో నాలుగు మండాలాల్లోని 92 గ్రామా పంచాయితీలున్నాయి. ఈ మెత్తం గ్రామాల్లో 100 శాతం అస్ధి పన్ను సేకరణ లక్ష్యంగా మంత్రి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్‌లు కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజలకి పన్ను ప్రయోజనాలు వివరిస్తూ మెత్తం పన్నులు వసూలు అయ్యేలా చైతన్యపరుస్తు పన్నులు వసూలు చేశారు. అయితే కొంత మంది మాత్రం పన్నుల పైసలు దుర్వినియోగం అవుతాయన్న అనుమానం వ్యక్తం చేస్తే మంత్రి అలోచన విధానాన్ని వివరించి వారిలో నమ్మకం పెంచారు. కొన్ని సార్లు మంత్రే స్వయంగా కొంత మంది గ్రామా పెద్దలతో స్వయంగా మాట్లాడారు. ఇలాంటి చర్యలతో ఇప్పటిదాక సూమారు 95శాతం గ్రామ పంచాయితీల్లో 100 శాతం ఆస్ది పన్ను వసూలు పూర్తి అయ్యింది. నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా బాకాయి ఉన్న ఇంటిపన్ను మెత్తం వసూలు అయ్యింది. మరో వారంలో మిగిలిన మెత్తాన్ని పూర్తి చేసి మంత్రి అధికారికంగా పూర్తి వివరాలు, ఈ కార్యక్రమంపై తదుపరి రాష్ట్ర స్థాయి కార్యచరణని ప్రకటించబోతున్నారు. సిరిసిల్లా నియోజక వర్గంలో జరుగుతున్న ఈ వినూత్న కార్యక్రమ ప్రభావం వల్ల జిల్లా మెత్తం పన్నుల వసూలు గతంలో కంటే భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా పంచాయితీరాజ్ అధికారులు తమ గ్రామ స్ధాయి ఆధికారులతో కలసి ఈ వంద శాతం పన్నుల చెల్లింపుల కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మెత్తం పన్నులు చెల్లించిన సిరిసిల్లాలోని గ్రామాల్లో పెరిగిన పౌర సేవల్ని పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఇతర గ్రామాలకి వివరిస్తున్నారు