ప్రజాకాంక్షలను 

మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు
– ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి
– సీలేరు హైడల్‌ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారు
– కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ప్రకటించాలని
– ఏపీ ధోరణితోనే హైకోర్టు విభజన ఆలస్యమవుతుంది
– పార్లమెంట్‌ సమావేశంలో తెరాస ఎంపీ వినోద్‌ కుమార్‌
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రజాకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ వినోద్‌ మాట్లాడారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఈ నాలుగేళ్లలో నెరవేరలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అన్యాయంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధప్రదేశ్‌లో విలీనం చేసిందన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పాడు. ప్రధాని మోదీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని, ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు సభలో బిల్లు పెట్టాలని ఎంపీ వినోద్‌ కోరారు. సీలేరు హైడల్‌ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారని, విద్యుత్‌ సరఫరాలో ఏపీ అడ్డంకులు సృష్టించినా.. ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు నుంచి విద్యుత్‌ కొనుగోలు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ ¬దా ప్రకటించాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ప్రకటించాలని వినోద్‌ డిమాండ్‌ చేశారు. పోలవరం కోసం నిధులు కావాలని గల్లా జయదేవ్‌ కోరారని, వారు అడిగిన నిధులు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని, పోలవరం విషయంలో తాము అడుగుతున్నది నీటి పంపకం గురించి మాత్రమే అని వినోద్‌ పేర్కొన్నారు. పోలవరానికి తాము అభ్యంతరం చెప్పలేదని వినోద్‌ స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఊసే కేంద్రం ఎత్తడంలేదని, గిరిజన యూనివర్సిటీకి స్థలం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వినోద్‌ తెలిపారు.
హైకోర్టు విభజన విషయంలో ఇంతవరకు అడుగు ముందుకు పడలేదన్నారు. ఏపీ సీఎం ధోరణి వల్లే హైకోర్టు విభజన ఆలస్యమవుతోందని, నాలుగేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపయ్యాయని, కేంద్ర సహకారమే ఇందుకు కారణమని ఎంపీ వినోద్‌ అన్నారు. మిషన్‌కాకతీయతో 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నామని వినోద్‌ చెప్పారు. మిషన్‌ కాకతీయకు నీతి అయోగ్‌ రూ.5 వేల కోట్లు ఇవ్వాలన్నా.. ఆర్థికశాఖ మోకాలడ్డిందని వినోద్‌ విమర్శించారు. రూ.40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ చేపట్టామని, త్వరలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. ——————————
బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకుల్లో..
సింధు, సైనా స్థానాలు పదిలం
న్యూఢిల్లీ: భారత అగశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. తాజాగా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌(బీడబ్ల్యూఎఫ్‌) క్రీడాకారుల ర్యాంకులను ప్రకటించింది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు తన మూడో స్థానాన్ని కాపాడుకుంది. సహచర క్రీడాకారిణి నెహ్వాల్‌ 10వ ర్యాంకును పదిలం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌ జాబితాలో కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ వరుసగా 5, 11వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు సవిూర్‌ వర్మ, బి.సాయి ప్రణీత్‌ చెరో పాయింట్‌ కోల్పోయి వరుసగా 19, 25వ స్థానాలకు పడిపోయారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరిన పారుపల్లి కశ్యప్‌ ఆరు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచారు. మహిళల డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప, సిక్కీ రెడ్డి ఒక స్థానంలో పడిపోయి 28వ ర్యాంకులో నిలవగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌, పొన్నప్ప తొమ్మిది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంకు సాధించారు. 16ఏళ్ల వైష్ణవీ జక్కా రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్‌-50లోకి ప్రవేశించింది. కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు 50వ స్థానంలో నిలిచింది.