ప్రజాలదృష్టి మళ్లించడానికే దిష్టి బొమ్మల దాహనం డ్రామాకు తెర
-మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావుక విమాల్ కుమార్ జైన్
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్28(జనంసాక్షి)
ప్రజల దృష్టి మళ్లించడానికే దిష్టి బొమ్మల దహనం డ్రామాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావుక విమాల్ కుమార్ జైన అన్నగారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో పార్టీ మండల ఆధక్షులు జశ్వంత్ ఠాకూర్ ఏర్పాటు చెసినా సమావెశంలొ ఆయన పాల్గొని మాట్లాడుతూ వారం రోజుల్లో గిరిజనులకు 10శాతంరిజర్వేషన్ జీవో,దలితబందు అనిప్రకల్బాలు పలికిన తెరాస ప్రభుత్వం అమలు చేతకాక ప్రజల, గిరిజనుల దృష్టిమళ్లించడానికి కొత్తడ్రామాకు తెరలేపిందన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి కోతేమికాదని వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. రాష్ట్రంలోని వృద్దులకు పెన్షన్లు,మునుగోడు ఉపఎన్నికలకుదృష్టితో కొత్తగా పెన్షన్ కార్డుకు జారీచేసి రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు వారి ఖాతాలో నగధు వేయలేని ప్రభుత్వం గుర్విందా సామేత చేప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో రోలపాడులో బహిరంగంసభ పెట్టి సీతారామప్రాజెక్టుతో రిజర్వాయి నిర్మించి ఈ నియోజక వర్గ రైతుల భూములను సస్యశ్యామలం చేస్తామని శిలా పతకం వేసిన విషయం ఎందుకు మారిచారో, ఇలందు ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామన్న వాగ్దానం ఎంమైందో, గత దసర కె ఆర్టీసి డిపోను ప్రారంభిస్టామన్న బసు డిపో ఈ దసర వరకు కూడా అతిగతిలేదని, నియోజకవర్గంలో ఏ మండలానికి బస్టాండ్ గతి లేదని ఇంకా అనేక సమస్యలను పక్కనపెట్టి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం ఆదర్శ ప్రభుత్వం లాగా ఫోజు కొట్టి ప్రజలను గొర్రెలను చేసే ప్రయత్నం మానుకోవాలి. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాఅభివృద్ధి కోసం ఏంచేయాలో చేస్తుందని, ఈమధ్య వరంగల్లులో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిసన్ రెడ్డి చాల సవివరంగా వివరించారని అన్నారు. దానిమిదా ఇంతవరకు స్పదించని ప్రభుత్వం ఉన్నపలకంగా బయ్యారం ఉక్కుపరిశ్రమను తెరమిదికి తేవడంలొ ఆతర్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానంలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. ఓక పక్క డిల్లీ లిక్కర్ స్కంలో పీకల్లోతు మునిగి ఉన్న కుటుంభాని రక్షించే ప్రయత్నంలో భాగమే ఈ డ్రామా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు జంపాల శ్రీను, అజ్మీరా రాము,మండల నాయకులు రావూరి నాగేంద్రబాబు, మహేష్, జానిమియ ఎడ్ల శేఖర్, బుచ్చిబాబు, దేవ, సందీప్, శివకృష్ణ, నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.