ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు నుండి 25 ఫిర్యాదులు అందిన్నట్లు వాటిని సంబంధిత శాఖలకు పరిష్కార నిమితం అంజేయడం జరిగిందని అన్నారు.ప్రజావాణిలో 03 ఫిర్యాదులు రెవిన్యూ శాఖ, 19
తహశీల్దార్ లకు , డీసీపీ 02, జిల్లా పంచాయితీ అధికారి 1 , వచ్చినట్లు తెలిపారు.
ప్రజావాణిలో కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి , కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వర చారి ,అధికారులు ,తదితర సిబ్బంది పాల్గొన్నారు.