ప్రజాసంక్షేమమే టిడిపి లక్ష్యం: మంత్రి పితాని
ఏలూరు,సెప్టెంబర్3(జనం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని సత్యవరంలో సోమవారం గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పితాని సత్యనారాయణ చేతుల విూదుగా పంచాయతీ కార్యాలయ శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం మంత్రి పితాని గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే తెదేపా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ భవనం శంకుస్థాపన, అంగన్‌వాడీ కేంద్ర భవనాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను, ప్రభుత్వ పథకాల పనితీరును ప్రజలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేందుకు గ్రామ దర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెదేపా ప్రభుత్వం రైతు, మహిళ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఇదిలావుంటే గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే తెదేపా లక్ష్యమని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెం, గాంధీనగరం గ్రామాల్లో ఖగ్రామ దర్శిని గ్రామ వికాసం’ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సంగాయగూడెంలో గ్రామ సమాఖ్య భవన నిర్మాణానికి, ఎస్టీ సామాజిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.