ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం .
ఖమ్మం : 75 సంవత్సరాల భారత వజ్రోత్సవం సందర్భంగా ప్రచురించిన జాతీయ నాయకుల చిత్రపటాలతో కూడిన పోస్టర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం లేకపోవడం శోచనీయం అంబేద్కర్ గారు ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన అపర మేధావి యొక్క చిత్రపటం తెలంగాణ ప్రభుత్వం ముద్రించకపోవడం శోచనీయం మరియు బాధాకరం అన్నారు . ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పును సవరించవలసిందిగా ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నేత గుంతేటి వీరభద్రయ్య , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రు నాయక్ , మాల మహానాడు జిల్లా నాయకుడు కొట్టే సుధాకర్ , కామా ప్రభాకర్ , అసంఘటిత కార్మిక నాయకులు దాసరి శ్రీను , బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు నకరికంటి సంజీవరావు , విద్యావేత్త వీరభద్ర రెడ్డి , విశ్రాంత గెజిటెడ్ అధికారి ఫిరంగి రామదాసు , హరిలాల్ బోడ సామాజిక ఉద్యమకారులు రాంరెడ్డి తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు