ప్రజా కవి కాళోజి నారాయణరావు ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలి -జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ సి. శ్రీనివాస్.
ప్రజా కవి కాళోజీ నారాయణరావు ను స్ఫూర్తి గా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అన్నారు.శనివారం నూతన ఐ డి ఓ సి సమావేశము హాలు లో కాళోజీ నారాయణ రావు 109 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాకవి కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఆ మహానుబావుడు కలిగించిన స్పూర్తిని నేటి తరాలకు అందించాలని, యుద్ధం గెలవాలంటే అయుదాలే అక్కరలేదు, అక్షరాలతో గెలిచే, గెలిపించే వీరులుంటారు, తెలంగాణా యాస,తెలుగు బాషను ఊపిరి గా , తెలుగు అక్షరాన్ని కడ్గం గా చేసుకొని పోరాడిన తెలుగు వీరుడని, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు. కాళోజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి బి సి సంక్షేమ అధికారి సరోజమ్మ, జిల్లా పౌర సంబందాల అధికారి చెన్నమ్మ, కల్లెక్టరేట్ ఏ.ఓ. బద్రప్ప, శ్రీనివాసులు, నర్సిములు , శేఖర్ ,రఘు, షఫీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.