ప్రజా వాణి లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.– అధనపు కలెక్టర్ వీరారెడ్డి.

సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 07:-(జనం సాక్షి):
ప్రజావాణి లో వచ్చిన వివిధ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు.
 సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో   అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీదారుల  నుండి   అర్జీలను స్వీకరించారు.
 సంబంధిత అధికారులు
అర్జీదారు సమస్యను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి లో వివిధ సమస్యలపై  40  దరఖాస్తులు  వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా రెవిన్యూ అధికారి రాధికారమణి,  జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, ఆర్చిదారులు, తదితరులు పాల్గొన్నారు.