ప్రజా సంగ్రామ యాత్రలో అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

* ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారిని స్మరించిన బండి సంజయ్
 * ఉద్యమ కారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
* కేసిఆర్ పాలనపై నిప్పులు చెరిగిన : బండి సంజయ్
మోత్కూరు ఆగస్టు 13 జనంసాక్షి : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర లో బాగంగా శనివారం పొడిచేడు కు చేరుకుని భారతీయ జనతా పార్టీ జెండాను  ఆవిష్కరించారు. తెలంగాణ మలిదశ తొలి అమర వీరుడు కాసోజు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిజెపి సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా మండలంలోని పొడిచేడు నుండి ప్రారంభమైన యాత్ర అనాజిపూరం,బుజీలపురం,దర్మాపురం మీదుగా మోత్కూరు కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం కోసం జై తెలంగాణ అంటూ శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడని,శ్రీకాంతాచారి బలిదానం తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, అమరవీరుల ఆకాంక్షలకు త్యాగాలకు భిన్నంగా నేడు రాష్ట్రంలో కెసిఆర్ మూర్ఖపు పాలన కొనసాగుతోందని అన్నారు. కెసిఆర్ రాచరిక, నయా నిజాం పాలన చూసి అమర వీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ ఒక్క ఉద్యమకారుడు కి కెసిఆర్ న్యాయం చేయలేదు ఎంబీఏ, ఎంసీఏ, పి హెచ్ డి లు చేసిన వాళ్ళు ఉద్యోగాలు రాక గోర్లు కాచుకునే పరిస్థితి ఉందని,ఉద్యమకారులు అందరికీ వేదికగా  బిజెపి ఉందని వాళ్ళు భావిస్తున్నారు అమరవీరుల ఆశయాలను సాధించేందుకు.. వారి లక్ష్యాలను చేరుకునేందుకు వారికి బిజెపి అండగా ఉంటుందని ఉద్యమకారులను ఆదుకునే బాధ్యత భారతీయ జనతాపార్టీ తీసుకుంటుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులంతా బీజేపీలోకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నానని బిజెపి చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి తెలంగాణలో ఇదే చివరి ఉద్యమం కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు పి.వి శ్యామ్ సుందర్ రావు,రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి,కుమ్మరి శంకర్,జీవిత రాజశేఖర్,దాసరి మల్లేశం,కడియం రామ చంద్రయ్య,జిల్లా నాయకులు బయ్యని చంద్ర శేకర్,గౌరు శ్రీనివాస్, కొనతం నాగార్జున రెడ్డి,ఏలూరి శ్యామ్, బయ్యని రాజు, దీటి సంధ్యారాణి సందీప్ తదితరులు పాల్గొన్నారు.