ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అగ్రభాగంలో ఉన్న మంత్రి కేటీఆర్

ఐటీ మంత్రిగా ప్రపంచ దేశాల్లో తనదైన ముద్రటిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అగ్రభాగంలో ఉన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని,  ఆయన ఐటీ మంత్రిగా ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని,  టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్నారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్  నాయకులు, మహిళా నాయకులతో  కలిసి చింతా ప్రభాకర్  మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  మంత్రి జన్మదిన కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యను సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని స్వయంగా తానే సమస్య పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి మంత్రి కేటీఆర్ అన్నారు.  ఐటీ మంత్రిగా  తనదైన శైలిలో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఆయన విదేశాల్లో పర్యటించి తెలంగాణకు మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకువస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారుమంత్రి కేటీఆర్ కు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, డాక్టర్ శ్రీహరి, వెంకటేశ్వర్లు, జలంధర్, నర్సింలు, నాగరాజు గౌడ్ మాజీ సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి,  లాడే మల్లేశం, మధుసూదన్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజావార్తలు