ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట
కరీంనగర్,నవంబర్22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో జెండా గద్దెలు ఏర్పాటు- చేయాలని, ప్రతి పల్లెలో పార్టీ పతాకాలను ఆవిష్కరించాలని, సీమాంధ్రుల కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించారు.
గ్రామగ్రామనా విద్యార్థులను, మేధావులను, ఉద్యోగులను ఆకర్శించాలని, తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరేందకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల నేతలను సాదరంగా ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, షర్మిల పాదయాత్రలను తలదన్నేలా పల్లెబాట నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలంతా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ప్రకటించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రతినిధులు ఇప్పటికైనా మారకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. మరోవైపు అధిష్ఠానం ఆదేశాలకనుగుణంగా ఏక కాలంలో ఉద్యమం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని టీఆర్‌ఎస్ జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. ఈ నెల 25న సూర్యాపేట సభకు జిల్లా నుంచి పదివేల మంది తరలివెళ్లడంతో పాటు 29న నిర్వహించే దీక్షా దివస్‌లో ఒక్కో నియోజకవర్గం నుంచి వెయ్యిమంది చొప్పున పాల్గొంటామని వెల్లడించింది. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు- సీమాంధ్ర కుట్రలను వివరించి చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ నెల 30 నుంచి
జనవరి 10దాకా జిల్లాలో పల్లెబాట చేపట్టనున్నట్లు ప్రకటించింది పార్టీ చేపట్టే ప్రతి కార్యక్షికమాన్నీ విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈనెల 25న సూర్యాపేటలో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి పదివేల మందికి తక్కువ కాకుండా తరలి వెళ్లాలని సమావేశం నిర్ణయించింది. నియోజకవర్గం నుంచి వెయ్యిమంది తరలి అతిథులు సూచించగా నియోజకవర్గ ఇన్‌చార్జులు అంతకంటే ఎక్కువే సవిూకరిస్తామని హావిూ ఇచ్చారు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. స్థానిక సమస్యలు, విద్యుత్ కోతలకు నిరసనగా ఉద్యమాలు చేపట్టాలని, రైతులకు ఏడు గంటల విద్యుత్ సరఫరా కోసం పోరాట చేయాలని, మున్సిపాలిటీ-లకు,పంచాయతీలకు, జడ్పీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యుత్ సర్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, ఎస్సాస్పీ నీటి సరఫరాను 50 టీ-ఎంసీలకు పెంచి, రబీకి సరిపడా నీరందించాలని, నీలం తుపాను కారణంగా దెబ్బతిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు.