ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం నగర అధ్యక్షులు ఎ.శ్రీనివాస్‌అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోటీ పరీక్షల నిపుణులు అధ్యాపకులు శనిగరపుసమ్మయ్య విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు, ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణలో చదివి ఉత్తమ శిఖరాలను అధిరోహించాలన్నారు.