ప్రతి ఇంటికి మరుగుదొడ్డి,ఇంకుడు గుంత ఉండాలి — జడ్పీ సీఈవో విద్యాలత

టేకులపల్లి,నవంబర్ 16 (జనం సాక్షి): ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్యకారి నిర్వహణ అధికారి విద్యాలత అన్నారు. బుధవారం ఆకస్మికంగా టేకులపల్లి మండలంలో పర్యటించారు. కుంటల గ్రామపంచాయతీలో నిర్మాణం చేపట్టిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని, మండలంలోని ప్రతి గ్రామంలో ఇప్పటివరకు నిర్మించుకోనటువంటి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లను పరిశీలించి కొత్తగా మంజూరు చేసి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుంటల గ్రామంలో ఎర్రి పూతల వెంకటేశ్వర్లు, ఆలవాల కొమరమ్మ, ఎట్టి భద్రయ్య, దాసరి శ్రీను నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కుంటల గ్రామ పంచాయతీ సర్పంచ్ మోకాళ్ళ రమాదేవి, ఏపీవో కాలంగి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాము, ఉపాధి సిబ్బందిధనలక్ష్మి, రతన్లాల్, గ్రామస్తులు మోకాళ్ళ పోషాలు, అబ్బయ్య, వెంకటేశ్వర్లు, శేఖర్, వీరస్వామితదితరులు పాల్గొన్నారు.