ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

  తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 7 :: ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి అని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు
మనోహరాబాద్ మండల పరిధిలోగల మేజర్ గ్రామ పంచాయతీ కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం సమీపంలో జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు ఎంపవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని స్వయం సహాయక మహిళ సంఘాలు చేతితో తయారు చేసిన జ్యూట్ ఉత్పత్తుల స్టాళ్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.  ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను కో ఫ్రెండ్లీ వాడాలని, కోరారు ప్లాస్టిక్ వాడకం రోజు రోజు పెరుగుతుండడం వల్ల పర్యావరణానికి పెద్ద ప్రమాదం అవకాశముందని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే వాడాలని కోరారు  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహిళల సాధికారత గురించి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు ఎంపవర్ (ఎంపవర్) ట్రస్ట్ వారిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపవర్ ట్రస్ట్ ప్రతినిధి ప్రసాద్ కోమలేశ్వరం రంగనాథ్ రావు మహిళా సాధికారత కోసం శంషాబాద్ విమానశ్రయం సమీపంలో ఎంపవర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి జ్యూట్ ఉత్పత్తులను తయారుచేయిస్తూ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేసారు.
ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ సాధికారత అనేద జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ యొక్క ఒక ప్రత్యేక చొరవ, ఇది స్వయం సహాయక సంఘాల మహిళలను చేతితో తయారు చేసిన ఉత్పత్తులను తయారు చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి వీలు కల్పిస్తుందని, ఈ చొరవ వివిధ ప్రదేశాల నుండి జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ తో అనుబంధించబడిన స్వయం సహాయక బృందాలు లేదా దేశవ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఇతర ఎన్జీవోలు మరియు సమూహాలచే తయారు చేయబడిన ఉత్పత్తులపై దృష్టి పెడుతు వారికీ సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.యం.ఆర్ పోచంపల్లి హైవేస్ ప్రతినిధులు ప్రవీణ్ కుమార్, నాగేశ్వర రావు , ప్రవీణ్ , సతీష్ పట్నాయక్,  రక్ష సిబ్బంది మంగయ్య, చరణ్ కుమార్, రామకృష్ణ , మల్లేశం, భీంరావు మరియు ఫౌండేషన్ వాలంటీర్ పోచలు పాల్గొన్నారు.