ప్రతి ఒక్కరు భక్తి భవాని అలవర్చుకోవాలి.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 23 (జనం సాక్షి)ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.శ్రీ అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నీ గానమే నా ప్రాణం అఖండ భజన కార్యక్రమం నిరంతరాయంగా 12 గంటల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ఆలయంలో ని అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి పాటలను మనసారా ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఆలయ పూజారి వేదమంత్రచరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రత్నమాల నర్సింలు, పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గడ్డల రవీందర్, ఇందుర్ ప్రకాష్, మరేపల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు బలవంత్ రెడ్డి, బి.రఘు, అశోక్ ముదిరాజ్, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, విజయ కుమార్ గౌడ్,కేశవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.